Electricity | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): వేసవికాలంలో ఫైవ్‌స్టార్ ఏసీలు వాడితే 60% మేర విద్యుత్తు ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సౌతిండియా మీడియా అడ్వైజర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. దేశంలో వాడుతున్న ఏసీల్లో అత్యధికం ఎనిమిదేండ్ల కంటే పాతవని ఆయన పేర్కొన్నారు. ఈపాత మాడల్ ఏసీలు 40-50% విద్యుత్తును అధికంగా వినియోగిస్తున్నట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయని అన్నారు.
రేటెడ్ ఏసీలు వాడటం ఉత్తమమని ఆయన సూచించారు. ఏసీని 24 సెల్సియల్ డిగ్రీల్లో ఉంచితే.. ఏటా 10బిలియన్ కిలోవాట్ల విద్యుత్తు ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఫైవ్‌స్టార్ రేటెడ్ విద్యుత్తు ఉపకరణాల వినియోగాన్ని పెంచేందుకు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, లక్నో, గాంధీనగర్, భోపాల్, జైపూర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ వంటి నగరాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఫైవ్‌స్టార్ రేటెడ్ ఏసీల వాడకంతో భూపాతాన్ని తగ్గించడంతోపాటు, గ్రీన్‌హౌజ్ గ్యాసెస్‌ని అరికట్టవచ్చని ఆయన తెలిపారు.