హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఎస్ఈసీ రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్ ఎంజీ గోపాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.