RTI | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ల నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌తోపాటు ఏడుగురు కమిషనర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ప్రధాన కమిషనర్‌గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్లుగా జర్నలిస్టు పీవీ శ్రీనివాసరావు, సీపీఆర్వోగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, కప్పర హరిప్రసాద్, పీఎల్ఎన్ హరిప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ మొహిసిన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.
సంబంధించిన ఫైల్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించినట్టు తెలుస్తున్నది. గవర్నర్ ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయమై సోమవారం సాయంత్రం వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. కాగా, ఏడుగురు కమిషనర్లలో ముగ్గురు జర్నలిస్టులు ఉండడం గమనార్హం. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్టీఐ అమలుకు సంబంధించిన కమిషనర్ల నియామకం జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా నియామకాలు చేపట్టలేదు.