హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జీ చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. గవర్నర్ ఆమోదంతో ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. ప్రస్తుతం ఆయన సీఎం పేషీలో ముఖ్య కార్యదర్శిగా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ఆఫ్ ఫారెస్ట్‌గా, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మం డలం బొరేగావ్కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి 1991లో విధుల్లో చేరారు.
కమిషనర్ల నియామకం పెండింగ్..
సమాచార కమిషనర్ల నియామకంపై స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, ప్రజా సంఘాల బాధ్యుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వీరికి రాజకీయ నేపథ్యం ఉన్నదని పలువురి అభ్యంతరాలతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తున్నది.
రెండు విభాగాలుగా పురపాలక శాఖ
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్(ఎంఏయూడీ) శాఖను రెండు విభాగాలుగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఎంఏయూడీని మెట్రోపాలిటన్ ఏరి యా అండ్ అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లుగా ఏర్పాటుచేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం కింద హెచ్ఎండీఏ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఓఆర్ఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీతోపాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, హెచ్ఎండీఏ పరిధిలోని హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ, ఎమ్మార్డీసీఎల్, హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఆర్డీసీఎల్, హెచ్‌జీసీఎల్, ఎఫ్‌సీడీఏ, హైడ్రా, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్, రెరా అండ్ రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉండనున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద ఓఆర్ఆర్ వెలుపలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ ఉంటాయి. టీయూఎఫ్ఐడీసీ, ఎన్ఐయూఎం, మె ప్మా, మున్సిపల్ సర్వీసెస్ ఉంటాయి.