మహదేవపూర్, మే 7: కాళేశ్వరంప్రాజెక్ట్ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను మంగళవారం జ్యుడీషియల్ కమిషన్ సందర్శించింది. కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఇరిగేషన్ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నిపుణుల బృందం, కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి బరాజ్‌ను పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై న్యాయ విచారణలో భాగంగా బరాజ్‌లోని కుంగుబాటుకు గురైన 19, 20, 21వ పియర్లలతోపాటు ఏడో బ్లాక్‌లో వంతెనపై కాలినడకన వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్ల ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. బరాజ్‌లో కుంగిన పియర్ల పగుళ్లను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను, ఇతర సాంకేతిక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ మాట్లాడుతూ.. ఎన్డీఎస్ఏ నివేదిక ఆదివారమే అందిందని, దాన్ని అధికారుల సమక్షంలో సమీక్షిస్తున్నట్టు తెలిపారు. వీరి వెంట ఓఅండ్ఎం జనరల్ అనిల్, ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు, సీఈ సుధాకర్‌రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటకృష్ణ, ఈఈ తిరుపతిరావు, ఎల్అండ్టీ ప్రాజెక్ట్ మేనేజర్ రజనీష్, నిఫుణులు, అధికారులు ఉన్నారు.