హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగా ణ): ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ధనవంతుడైన ఎమ్మెల్యేగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గుర్తింపు పొందారు. రూ.668 కోట్లతో ఏపీలో అందరికంటే ధనవంతుడైన ఎమ్మెల్యేగా నిలిచారు. ఏడీఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో అన్ని రాష్ర్టాల ఎమ్మెల్యేల్లో చంద్రబాబు 3వ స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఎన్ నాగరాజు, రెండో స్థానంలో డీకే శివకుమార్ ఉన్నారు. దేశంలో అత్యధిక ధనవంతులైన సీఎంల జాబితాలో ఏపీ సీఎం జగన్ మొదటి స్థానంలో ఉన్నట్టు ఏడీఆర్ ఇటీవలే పేర్కొన్నది.