హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంక్ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలోనే పెట్రోల్ అమ్మకంలో మొదటి స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో రూ.75 కోట్ల విలువైన 69 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలతో మరోసారి ‘ఉత్తమ పెట్రోల్ బంక్’ అవార్డు సొంతం చేసుకున్నది.
డివిజనల్ సేల్స్ జనరల్ మేనేజర్ సుబ్రతోరాయ్ ఈ అవార్డును జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్‌కు అందజేశారు. పెట్రోల్ అమ్మకాలతో వచ్చిన లాభాలను ఖైదీల సంక్షేమం, జైళ్లశాఖ అభివృద్ధికి ఉపయోగిస్తామని శివకుమార్‌గౌడ్ వెల్లడించారు.