Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించనుందా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయా సంస్థలు చేపట్టిన ప్రతి సర్వేలోనూ జూబ్లీహిల్స్ ఓటర్లు గులాబీ పార్టీకి జై కొడుతున్నారు. సర్వేల ప్రకారం ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే.. వరుసగా మూడోసారి గెలిచినట్టు. గతంలో జరిగిన 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన మాగంటి గోపీనాథ్.. ఆ తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు.
ఇక తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎనిక ఫలితాలపై చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే రిపోర్టును వెల్లడించింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి 43 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి 38 శాతం, బీజేపీకి 10 శాతం, ఇతరులకు 9 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే సంస్థ వెల్లడించింది.
మొన్నటికి మొన్న ‘కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’ సంస్థ, ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ సంస్థ వేర్వేరుగా నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్దే విజయమని తేలింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో 50.5 శాతం మంది ముస్లింలు గులాబీ పార్టీకి పట్టంగట్టినట్టు ‘బిలియన్ కనెక్ట్’ సర్వేలో తేటతెల్లమైంది. బయటి సర్వేలే కాదు.. కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లోనూ.. హస్తం పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీనే జూబ్లీహిల్స్‌లో ముందంజలో ఉన్నట్టు తేలడం గమనార్హం.
జూబ్లీహిల్స్ ఉప ఎనిక ఫలితాలపై సర్వే రిపోర్టు వెల్లడించిన చాణక్య స్ట్రాటజీస్ సంస్థ
బీఆర్ఎస్ 43%
కాంగ్రెస్ 38%
బీజేపీ 10%
ఇతరులు 9% pic.twitter.com/MKqxnHtdQX— Telugu Scribe (@TeluguScribe) November 4, 2025