హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : గిరిజన హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 6న చలోఢిల్లీ కార్యక్రమానికి ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ పిలుపునిచ్చింది. కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరాంనాయక్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 6న జాతీయ పోరాట సదస్సు, 7న ఆదివాసీ గిరిజనులతో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ధర్నాలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్తోపాటు 16 రాష్ట్రాల ఆదివాసీ గిరిజనులు, ఉద్యమకారులు, ప్రతినిధులు పాల్గొనున్నట్టు వెల్లడించారు.