యాదాద్రి, మార్చి 13 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పదోరోజైన ఆదివారం చక్రతీర్థ స్నాన ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి, పుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవాన్ని శాస్ర్తోక్తంగా జరిపించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్వాల మధ్య వేడుకలు కొనసాగగా భక్తుల గోవింద నామస్మరణతో బాలాలయం మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు పాల్గొన్నారు. సోమవారం స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు స్వామివారి శృంగార డోలోత్సవంతో వేడుకలకు ముగింపు పలుకనున్నారు.