రవీంద్రభారతి, అక్టోబర్ 4: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విజయానికి ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి ఎన్నికల చైతన్య రథయాత్ర నిర్వహించనున్నట్టు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సమాఖ్య కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 128 గ్రామాల్లో ఈ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఓసీ సమాఖ్య విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ స్పందించి ఓసీల్లోని పేదల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి ఇతరులకు వర్తింపజేసే సంక్షేమ కార్యక్రమాలను ఓసీలకు కూడా అందిస్తున్నందుకు కృతజ్ఞతగా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నది ఓసీ జేఏసీ లక్ష్యమని పేర్కొన్నారు.