హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): అమలు సాధ్యం కాని హామీలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేవేళ్లకు వచ్చారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ దొంగమాటలేనని, కర్ణాటకలో తేటతెల్లమైందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఓడ ఎకేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న అన్న చందంగా వ్యవహించిన కాంగ్రెస్ కర్ణాటకలో ఒక హామీనైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. విదేశీ విద్య కోసం ఎస్సీ విద్యార్థులకు సాయాన్ని బీఆర్ఎస్ సరార్ ఇప్పటీకే అందిస్తున్నదని, కొత్తగా కాంగ్రెస్ ఏమిస్తుందని ప్రశ్నించారు.