హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజాహితానికి పోలీసు వ్యవస్థ కృషి చేయాలని రాష్ట్ర పోలీసు కైంప్లెంట్స్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బీ శివశంకరరావు పేర్కొన్నారు. మంగళవారం బీఆర్కే భవన్‌లోని పోలీసు కైంప్లెంట్స్ అథారిటీ కార్యాలయంలో అథారిటీ చైర్మన్, సభ్యులను హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ డాక్టర్ జితేందర్, అడిషనల్ డీజీపీ (లాఅండ్ఆర్డర్) మహేష్ ఎం భగవత్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థలోని లోటుపాట్లు, ప్రజాహితానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో అథారిటీ సభ్యులు ప్రమోద్‌కుమార్, వర్రె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.