హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించారు. మంత్రి ఎర్రబెల్లితో మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీల ఉద్యోగ కార్మికుల జేఏసీ ప్రతినిధులు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థికపరమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. దీంతో గత 34 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. బుధవారం నుంచి విధుల్లోకి చేరనున్నట్టు మంత్రి దయాకర్రావు, ముఖ్య కార్యదర్శులకు ఉద్యోగ, కార్మికుల జేఏసీ ప్రతినిధులు మంగళవారం లేఖ రాశారు.