Urea App | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫర్టిలైజర్) యాప్‌ను కేంద్రం అభినందించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్నప్పటికీ, మారెట్లో నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో నకిలీ ఉత్పత్తులు చలామణీ అవుతున్నాయని అన్నారు. నకిలీ సేంద్రియ లేబుళ్లను నిరోధించేందుకు వీలుగా వ్యవసాయశాఖ సేంద్రియ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చే లా ఒక యాప్ తీసుకురానున్నదని చెప్పారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే వానకాలం వరకు ఈ యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేవాలని సూచించారు. ఈ నెలాఖరు నాటికి పంటల శాటిలైట్ మ్యాపింగ్ డాటా రావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బా షా, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
22 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా
కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న మహానగరాల్లో గ్రీనరీ ఎంతో అవసరమని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 19వ గ్రాండ్నర్సరీ మే ళా బ్రోచర్‌ను మంగళవారం ఆవిషరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 22 నుంచి 26 వరకు ఆలిండియా హార్టి, అగ్రికల్చర్ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని చెప్పారు.