హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండటం బీజేపీకి మింగుడు పడటం లేదని, ఎలాగైనా రాష్ర్టాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ గమనిస్తున్న తెలంగాణ ప్రజలు తగిన సమయంలో బీజేపీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని చెప్పారు. రైతుబంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఇలాంటి కార్యక్రమాలను ఇతర రాష్ర్టాల్లోనూ ప్రోత్సహించడానికి బదులు తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని మండిపడ్డారు. హిందూ మత పక్షపాతులమని చెప్పుకొనే బీజేపీ నాయకులు తమ పాలనలోని రాష్ర్టాల్లో యాదగిరిగుట్ట లాంటి ఒక్క దేవాలయాన్ని కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు.