సుప్రీం తీర్పును వక్రీకరించవద్దు‘
కులగణనపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును వక్రీకరించవద్దని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు.
- కులగణన’పై కేంద్రానిదే తుది నిర్ణయం
- బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కులగణనపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును వక్రీకరించవద్దని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు. జనగణనలో కులగణన నిర్వహించవద్దని కోరుతూ ఇటీవల ఒకరు రిట్ పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలా? వద్దా? అనేది కేంద్ర ప్రభుత్వ శాసనపరమైన విధాన నిర్ణయాల పరిధిలోకి వచ్చే అంశమని, అంటే తుది నిర్ణయం కేంద్రానిదేనని వెల్లడించిందని పేర్కొన్నారు.
అయితే కొందరు వాస్తవ విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. తమ సర్వే వల్లేనని కొన్ని రాజకీయపార్టీలు, బీసీ సంఘాలు సైతం ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కులసర్వేను ప్రశంసించినట్టుగా చెప్పుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం నిర్వహించే ‘సెన్సస్’ ఒక్కటే అధికారికమని, రాజ్యాంగబద్ధత ఉంటుందని, రాష్ర్టాలు నిర్వహించే సర్వేలకు సెన్సస్తో సమానంగా పరిగణించడం సరికాదని తెలిపారు. కుల సర్వే వెనుక అనేక బీసీ సంఘాల దీర్ఘకాల పోరాటం, సామాజిక చైతన్యం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

