న్యూఢిల్లీ: క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న రోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశంలో డ్రగ్స్ కొరతను అధిగమించేందుకు, ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు గాను.. కీలకమైన కొన్ని కీమోథెరపీ ఔషధాల ధరలను పెంచుతూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రెండు కీలకమైన సిస్లాటిన్, కార్బోప్లాటిన్ ఔషధాల ధరల పెంపునకు కేంద్రం అధికారికంగా ఆమోదం తెలిపింది.
దీంతో క్యాన్సర్ రోగులపై అదనపు భారం పడబోతున్నది. మందుల అందుబాటు ధరను లేదా లభ్యతను నిర్ధారించడానికి జోక్యం అవసరమని ప్రభుత్వం భావించినప్పుడు అసాధారణ అధికారాన్ని కేంద్రం ఉపయోగిస్తుంది.