హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పోలీసు అధికారులు, ఇతర ఏజెన్సీలు జప్తు చేసే నగదు, ఇతర వస్తువులకు వాస్తవికత ఉంటే వారు తిరిగి పొందే విధానాన్ని సరళతరం చేయాలని కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్‌కుమార్ వ్యాస్ ఆదేశించారు. వారి వస్తువులు వారు పొందే వెసులుబాటుపై ఈసారి ముందస్తుగా ప్రచారం కల్పించాలని చెప్పా రు.
బుధవారం హైదరాబాద్‌లోని సీఈవో ఆఫీసులో జరిగిన విస్తృతస్థాయి సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర బృందం కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.