ఆర్ఎఫ్సీఎల్ ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆరోపించారు.
- ఉద్యోగ కల్పనలో స్థానికులకు రిక్తహస్తం
- పోలీస్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆరోపించారు. సంస్థలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పిన మాటలు కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఉద్యోగాల విషయంపై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు.
ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి ముందు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకేనని నమ్మబలికిన కేంద్రం.. తర్వాత తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసిందన్నారు. కొన్ని రోజులుగా సాంకేతిక లోపంతో ఉత్పత్తి నిలిచిపోయినా.. ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేస్తామని మోదీ ఏర్పాట్లు చేయడాన్ని తప్పుపట్టారు. సింగరేణి సంస్థను కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణి ద్వారా ఉపాధి పొందుతున్న 10 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నాన్ని ఖండించారు. సింగరేణిలో 49 శాతం వాటా మాత్రమే కల్గిన కేంద్రం.. సంస్థపై విషం చిమ్ముతున్నదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం, సింగరేణి కార్మికులపట్ల కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా శనివారం రామగుండం వస్తున్న మోదీ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

