నర్సాపూర్, డిసెంబర్ 18: వ్యవసాయ రం గాన్ని కార్పొరేట్‌కు ధారాదత్తం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రాములు ఆరోపించారు. ఓవైపు దేశభక్తి అంటూనే మరోవైపు దేశ సంపదను కొల్లగొడుతున్నారని విమర్శించారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన జిల్లా 14వ సీపీఎం మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కొత్త విద్యుత్తు చట్టంతో రాష్ర్టాల పరిధిని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటున్నదని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని గద్దె దించేలా ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు.