జనగామ : కావాలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను అణిచివేస్తున్నది. కేంద్ర మంత్రులు మాట్లాడే పద్ధతి ఏ మాత్రం సభ్యతగా లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జనగామ టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రులు పూటకో తీరుగా మాట్లాడుతున్నారు. రా రైస్ కోంటాం అంటున్నారు. తెలంగాణలో రా రైస్ రాదు. వర్షాకాలంలో సీఎం కేసీఆర్ యాసంగి పంటను కోనేది లేనిది చెప్పమంటే చెప్పలేదు.
కాళేశ్వరం, దేవాదులతో ప్రాజెక్టులతో ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ తెలంగాణ రైతులను మోసం చేస్తుందన్నారు. నల్లచట్టాలను వ్యతిరేకించాం. ఆ కోపంతో తెలంగాణ ప్రభుత్వాన్ని తోక్కాలనే బీజేపీ ప్రయత్నిస్తుందని మంత్రి ఆరోపించారు. 700 మంది రైతులు మరణిస్తే కానీ ప్రధాని మోదీ నల్ల చట్టాలు వెనక్కి తీసుకోలేదు.
రైతాంగం అంతా ఏకం కావాలి ప్రతి గింజ కొంటాం అనే వరకు పోరాటం కొనసాగించాలని మంత్రి పిలుపునిచ్చారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ప్రతి ఇంటి పై నల్ల జెండా ఎగరవేయాలి., శనయాత్రలు చేపట్టాలన్నారు. ధాన్యాన్ని కేంద్రమే కొనాలనే నినాదంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.