హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జనగణన 2027కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్వర్వులు జారీ చేసింది. సెన్సస్-2027 గెజిట్ నోటిఫికేషన్ పునః ప్రచురణకు ఆదేశాలు జారీ చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 29న తెలంగాణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రచురించనున్నారు. సెన్సస్-2027లో భాగంగా ప్రజలకు సంబంధించిన మొత్తం 40 రకాల వివరాల సేకరణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జనగణనకు సంబంధించి ప్రతి వ్యక్తికీ సంబంధించిన వివరాలను సేకరించనున్నారు.