బండ్లగూడ, జూలై 4 : ఓ యువకుడి ప్యాంట్ జేబులో సెల్‌ఫోన్ పేలిన ఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెయింటర్‌గా పనిచేస్తూ అత్తాపూర్‌లో ఉంటున్న శ్రీనివాస్.. శుక్రవారం ఉదయం ఫోన్ జేబులో పెట్టుకొని పనికోసం బైక్‌పై వెళ్తున్నాడు. ఈక్రమంలో అత్తాపూర్ చౌరస్తాకు వచ్చే సరికి ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ వేడెక్కింది.
గమనించిన శ్రీనివాస్ బైక్‌ను పక్కకు నిలిపి బేజులోంచి ఫోన్ తీసేసరికి అప్పటికే ఫోన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో ఫోన్‌ను వెంటనే పక్కకు విసిరేశాడు. అప్పటికే స్వల్పంగా గాయపడిన శ్రీనివాస్ స్థానిక దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. రోజుమాదిరిగానే గంటసేపు ఫోన్ చార్జింగ్ పెట్టి తీశానని, ఎందుకు పేలిందో తెలియడం లేదని తెలిపాడు.
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర శాసనసభ మీడియా సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ ఆదేశాలు జారీచేసినట్టు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కమిటీ చైర్మన్‌గా ‘న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కో-చైర్మన్‌గా ఎన్టీవీ సీనియర్ రిపోర్టర్ పోలోజు పరిపూర్ణాచారి, సభ్యులుగా అయితరాజు రంగారావు, బొడ్లపాటి పూర్ణచందర్రావు, ఎల్ వెంకట్రాంరెడ్డి, పోలంపల్లి ఆంజనేయులు, ఎం పవన్ కుమార్, భీమనపల్లి అశోక్, బుర్రా ఆంజనేయులుగౌడ్, సురేఖ అబ్బూరి, మహ్మద్ నయీం వజాహత్, బసవ పున్నయ్య, ప్రమోద్ కుమార్ చతుర్వేది, సుంచ అశోక్, బీహెచ్ఎంకే గాంధీ వ్యవహరిస్తారని తెలిపారు.