Madhya Pradesh | దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం.. మధ్యప్రదేశ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సచివాలయంలో జూన్ 2న ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు.
- మహాకాల్ ఉజ్జయినిలో గవర్నర్ అధ్యక్షతన నిర్వహణ
- ఎంపీ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నరహరి ట్వీట్
- వేడుకల నిర్వహణకు అధికారుల నియామకం
Madhya Pradesh | హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సచివాలయంలో జూన్ 2న ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు. వేడుకల ఏర్పాట్ల కోసం శాఖలవారీగా 13,398 మంది అధికారులను నియమించారు. అన్ని శాఖల నుంచి 7,250 మంది అధికారులను వేడుకలకు ఆహ్వానించటంతోపాటు, వారికోసం 151 బస్సులను ఏర్పాటు చేశారు. సమన్వయం కోసం నోడల్ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది.
ఎంపీలో ఎగురనున్న తెలంగాణ జెండా
జమ్మికుంట, మే 31: మధ్యప్రదేశ్‌లో మన తెలంగాణ జెండా సగౌరవంగా ఎగురనున్న ది. దశాబ్ది వేడుకలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి (పెద్దపల్లి జిల్లా బసంత్నగర్వాసి) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహాకాల్ ఉజ్జయిని నగరంలో జూన్ 2న ఆ రాష్ట్ర గవర్నర్ మంగుబాయి పటేల్ అధ్యక్షతన వేడుకలు జరుగనున్నట్టు తెలిపారు. ముఖ్య అతిథిగా ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ మోహన్‌యాదవ్ పాల్గొననున్నారని, కార్యక్రమానికి తనను కూడా ప్రభుత్వం ఆహ్వానించిందని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించటం, అందులో తాను పాల్గొనటం.. తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా ఉన్నదని తెలిపారు. ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నరహరి ధన్యవాదాలు తెలిపారు. పండుగలా సాగే ఈ వేడుకల్లో తెలంగాణవాసులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
న్యూఢిల్లీ, మే 31(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. ఢిల్లీలోని తెలంగాణ భవనంలోఅంబేద్కర్ ఆడిటోరియం వేదికగా ఉత్సవాలు జరుగనున్నాయి. 2న ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించటం, ఫొటో ఎగ్జిబిషన్, హెల్త్చెకప్ క్యాంపులు, సాంస్కృతిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఆలయాలపై నృత్యప్రదర్శన, గిరిజన నృత్యం-కొమ్మకోయా వంటివి ప్రదర్శించనున్నారు. మాజీ ఎంపీ మందా జగన్నాథం, రిటైర్డ్ ఐఏఎస్ కేఎం సాహ్ని, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. దశాబ్ది ఉత్సవాల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు.
2న కోర్టుల్లో జాతీయ పతాకావిష్కరణ
నాంపల్లి కోర్టులు, మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాఎగురవేయనున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కే సుజన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

