హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్‌కు పత్తిరైతు గోసపట్టదా? అని బీఆర్ఎస్ సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పత్తికొనుగోళ్లపై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి దాకా కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ధాన్యానికే కాకుండా పత్తికీ క్వింటాల్‌కు రూ. 475 బోనస్ ఇస్తామని మేనిఫేస్టోలో పేర్కొన్నదని గుర్తుచేశారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటంతో, వచ్చిన కొద్దిపాటి పత్తిని రైతులు ప్రైవేటు వ్యాపారులకు తకువధరకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎస్పీనీ అన్ని కేంద్రాల్లో అమలయ్యేలా చూడాలని, లేకుంటే సర్కార్‌పై రైతుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గత 45 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రరైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, పంట పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోసను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా చందూర్ ఎంపీడీవో కార్యాలయానికి 26 నెలల నుంచి అద్దె చెల్లించడం లేదని ఆవేదనకు గురైన భవన యజమాని గురువారం ఉదయమే ఆఫీస్‌కు తాళం వేశాడు. కార్యాలయానికి వచ్చిన ఎంపీడీవో నీలావతి సహా ఇతర అధికారులు, సిబ్బంది దాదాపు రెండున్నర గంటలకు పైగా ఆరు బయటే కూర్చున్నారు. పనుల కోసం వచ్చిన ప్రజలు సైతం ఇబ్బందులకు గురయ్యారు. మాజీ సర్పంచ్ సాయరెడ్డితోపాటు అధికారుల విజ్ఞప్తి మేరకు తాళం తీయడంతో అధికారులు విధుల్లో నిమగ్నమయ్యారు. -చందూర్