హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ నడుపుతున్న స్కూళ్లను దశలవారీగా సీబీఎస్ఈ స్కూళ్లుగా మార్చనున్నారు. ప్రస్తుతం రామగుండం -2 ఏరియాలోని సెక్టర్ -3 స్కూల్లో సీబీఎస్ఈ బోధనను ప్రవేశపెట్టనున్నట్టు సంస్థ సీఎండీ ఎన్ బలరాం శనివారం తెలిపారు.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 9 స్కూళ్లు, జూనియర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. వీటి పనితీరుపై శనివారం సీఎండీ బలరాం హైదరాబాద్‌లోని సింగరేణిభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ద్వారా స మీక్షించారు. విద్యాసంస్థలు 100శాతం ఫలితాలు సాధించాలని సీఎండీ ఆకాంక్షించారు. ఖర్చుకు వెనుకాడకుండా పాఠశాలల ఆధునీకీకరణకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సంస్థ డైరెక్టర్ ఎస్వీకే శ్రీనివాస్, జీ ఎంలు దేవేందర్, నికోలస్ పాల్గొన్నారు.