హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) నకిలీ నెయ్యిని సరఫరా చేశారని సీబీఐ తేల్చింది. పా మాయిల్కు రసాయనాలు కలిపి ఆవునెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి మోసం చేశారని గుర్తించింది. సీబీఐ తన నివేదికను మంగళవారం ఏపీ హైకోర్టుకు సమర్పించింది. నకిలీ నెయ్యిని టీటీడీతోపాటు ఏపీలోని ప్రముఖ ఆలయాలైన కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయాల్లో ప్రసాదాల తయారీకి సరఫరా చేశారని తమ దర్యాప్తులో తేలినట్టు సీబీఐ పేర్కొన్నది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలపై అరెస్టయిన వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడా వేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి ధర్మాస నం విచారణ జరిపింది.
సీబీఐ తర ఫు న్యాయవాది పీఎస్సీ సురేశ్ కుమా ర్ దర్యాప్తు నివేదికను ధర్మాసనానికి అందజేశారు. ఈ నివేదిక ప్రకారం.. టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని స్పష్టం చేసింది. ఈ నకిలీ నెయ్యి తయారీ వెనుక బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పామిల్ జైన్, విపిన్ జైన్‌ది కీలక పాత్ర అని పేర్కొన్నది. పలు డెయిరీల ద్వారా బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పామిల్ జైన్, విపిన్ జైన్ 240 కోట్ల లబ్ధి పొందినట్టు సీబీఐ గుర్తించింది. వీరితోపా టు వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడా కూడా లబ్ధి పొందినట్టు తెలిపింది. వీరి బెయిల్ పిటిషన్లపై విచారణను 28కి వాయిదా వేశారు.