హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తమ కులం పేర్లను మార్చాలని కోరుతూ పలు కులాల నేతలు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను దొమ్మర, వంశరాజ్, తమ్మలి తదితర కులాల ప్రతినిధులు గురువారం ప్రత్యేకంగా కలిశారు.
తమ కులం పేరును గడ వంశీగా మార్చాలని దొమ్మర, తమ పేరులో నుంచి పిచ్చిగుంట్ల అనే పదాన్ని పూర్తిగా తొలగించాలని వంశరాజ్, నాన్ బ్రాహ్మిణ్, శూద్రా క్యాస్ట్ పదాలను తమ కులం నుంచి తొలగించాలని తమ్మలి కులస్తులు విజ్ఞప్తి చేశారు. ఆయా పదాలతో తాము సమాజంలో అనేక అవమానాలు, అవహేళనలు ఎదురొంటున్నామని వాపోయారు. కమిషన్‌ను కలిసిన వారిలో ఆయా కులాల ప్రతినిధులు ఆరే రాములు , మురళీకృష్ణ , వటపత్ర సాయి తదితరులు ఉన్నారు.