రవీంద్రభారతి, ఫిబ్రవరి12: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్ర నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తప్పుల తడకగా మారిన కులగణన సర్వేను మళ్లీ జరపాలని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్, గౌరవ అధ్యక్షుడు లాలుకోట వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి చొల్లెటి కృష్ణామాచార్యులు, కోశాధికారి రాగిఫణి రవీంద్రాచారి మాట్లాడారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ జాతీయులకు రాష్ట్ర బీసీ కమిషన్, ప్లానింగ్ బోర్డు తీరని ద్రోహం చేశాయని విమర్శించారు. బీసీ జనాభా పెరగాల్సింది పోయి తగ్గడమేమిటని ప్రశ్నించా రు. సంఘం ఉపాధ్యక్షుడు పలిగిళ్ల శ్రీనివాసాచారి, నారోజు జగ్జీవన్, మా రోజు సుదర్శనాచారి, పెద్ద కొలిమి బ్రహ్మచారి, దేవరకొండ వీరాచారి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పబ్బోజు బిక్షపతి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీరామాచారి, ఆర్ విష్ణుచారి పాల్గొన్నారు.