Caste Census | హైదరాబాద్, మార్చి 1, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన పేరిట ఆర్భాటంగా చేపట్టిన సర్వేకు సంబంధించిన ఫారాలు పేపర్ ప్లేట్లుగా రూపాంతరం చెందాయి. రాష్ట్రంలోని ఓ హోటల్లో ఆహారపదార్థాలు అందించేందుకు కులగణన సర్వేప్లేట్లను వినియోగించడం చర్చనీయాంశమైంది.
ఆ హోటల్లో టీ కప్పుతో బిస్కెట్లను ఉంచిన పేపర్ప్లేట్ దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండంగా సర్కారు తీరుపై నెటిజన్లు సైటెర్లు వేస్తున్నారు.