Telangana Elections | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నేపథ్యంలో తనిఖీ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో కేవలం 11 రోజుల్లోనే రూ.243,76,19,296 విలువైన మద్యం, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.
గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో రూ.78 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశారు. గురువారం రూ.10.13 కోట్ల నగదు దొరకగా, 19వ తేదీ వరకు రూ.88 కోట్ల నగదు పట్టుబడింది. 19న రూ.1.21 కోట్ల విలువైన మద్యాన్ని అక్రమ రవాణా కాకుండా అడ్డుకున్నారు. ఇప్పటి వరకు రూ.120.40కోట్ల ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. ఇక ఎన్నికల వేళ ఓటర్లకు పంచే రైస్కుక్కర్లు, ల్యాప్టాప్లు, చీరలు, క్రీడా సామగ్రి, బియ్యం వంటి రూ.17,48,81,471 విలువైన వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.