సిరిసిల్ల కలెక్టరేట్, నవంబర్ 19: లగచర్ల రైతుల పెట్టిన కేసులను ఎత్తేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) రాజన్నసిరిసిల్ల జిల్లా మూడో మహాసభల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ పదేండ్ల పాలనలో దేశ ప్రజలకు పది పైసల మేలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాసర్, కమిటీ సభ్యుడు సైలాబ్ బాబు, నాయకుడు రమేశ్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.