కులకచర్ల, జనవరి 22: ‘అంగట్లో అమ్మకానికి కోడి గుడ్లు’ అనే శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి వికారాబాద్ డీడబ్ల్యూవో లలితకుమారి స్పందించా రు. అంగన్వాడీ గుడ్లను మార్కెట్లో విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీ గుడ్లపై ప్రభుత్వ ముద్ర ఉంటుందని, ఎక్కడ విక్రయించినా పట్టుకోవచ్చని తెలిపారు. చౌడాపూర్‌లో గుడ్లను విక్రయించిన మందిపల్‌కు చెందిన పెంటయ్యపై తమ సూపర్వైజర్ పోలీసులు, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి కేసు నమోదు చేయించారని తెలిపారు. అవి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కోడి గుడ్లని విచారణలో తేలిందని చెప్పారు. అదేవిధంగా చౌడాపూర్‌లో 2011 నుంచి ఆధార్‌కార్డులు పంచకుండా పడేసిన పోస్టుమ్యాన్పైనా క్రిమినల్ కేసు పెట్టించామని తహసీల్దార్ పేర్కొన్నారు.