మహబూబ్‌నగర్, అక్టోబర్ 13 : కాంగ్రెస్ నేత రాఘవేందర్‌రాజు ఓమహిళ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని డీజీపీకి ఫిర్యాదు అందగా.. అతడిపై కేసు నమోదు చేసినట్టు మహబూబ్‌నగర్ రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. బాధితురాలు పాలాది కళావతమ్మ కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా పాలకొండ శివారులో 272సర్వేనంబర్‌లో కళావతమ్మకు 3 ఎకరాల భూమి ఉన్నది. దీనిని రాఘవేందర్ రిజిస్ట్రేషన్ చేయించుకోగా ఈ విషయాన్ని డీజీపీకి ఫిర్యాదు చేయగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.