హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ‘నమస్తే తెలంగాణ’ కార్టూ న్ ఎడిటర్ చిలువేరు మృత్యుంజయకు జాతీయ స్థాయిలో అరుదై న గౌరవం దక్కింది. వరల్డ్ కార్టూనిస్ట్ డే సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని ‘కార్టూన్ వాచ్’ మ్యాగజైన్ ఆధ్వర్యంలో.. సాంస్కృతిక శాఖ నిర్వహించిన జాతీయస్థాయి కా ర్టూన్ పోటీల్లో ఆయన మొదటి బహుమతి అందుకున్నారు. ‘యుద్ధ కాలంలో విదేశీ ప్రయాణాలు వదిలి, శాంతి, పచ్చదనంతో నిండిన బస్తర్‌కు రండి’ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీలో దేశవ్యాప్తంగా అనేక మంది కార్టూనిస్టులు పాల్గొన్నారు. కాగా, మృత్యుంజయ ఆలోచనాత్మక కార్టూన్ జడ్జీలను ఆకట్టుకుంది.
ఈ కార్టూన్ పోటీ లో ఆయన మొదటి బహుమతితోపాటు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. కార్టూన్లో ఓ వైపు ఫారిన్ పేరుతో యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆయుధాలతో నిండిన భయానక దృశ్యాన్ని చూపించారు. మరోవైపు ‘బస్తర్’ పేరుతో ప్రకృతి సౌందర్యం శాంతి, పచ్చదనానికి ప్రతీకగా నెమలి ని చిత్రించారు. ఈ రెండు విభి న్న ప్రపంచాలను పోల్చుతూ, యుద్ధం కంటే శాంతి, ప్రకృతితో నిండిన జీవనం ఎంత ముఖ్యమో సందేశాత్మకంగా కార్టూన్ తెలియజేసింది. పలువురు ప్రముఖులు, సహచర కార్టూనిస్టులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు.