బన్సీలాల్‌పేట్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బ్రదర్స్‌లో ఒకరైన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు దారూరి శేషాచారి (66) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం ఆరోగ్యం క్షీణించడంతో సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్ నివాసంలో మృతి చెందారు.
ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శేషాచారి, రాఘవాచారి ఇద్దరు సోదరులు కర్ణాటక సంగీతంలో విద్వాంసులుగా ఖ్యాతిగాంచి, హైదరాబాద్ బ్రదర్స్‌గా దేశ విదేశాల్లో అనేక కచేరీలు నిర్వహించారు. శేషాచారి మృతిపై మాజీ ఐఏఎస్ రమణాచారి సంతాపం తెలిపారు. కళారంగానికి శేషాచారి చేసిన సేవలను కొనియాడారు.