తిరుమల : తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు భక్తులకు ( Hyderabad devotees ) ప్రమాదం జరిగింది . ఆదివారం ఉదయం తిరుమల( Tirumala ) రెండో ఘాట్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వారు స్వల్పగాయాలయ్యాయి . దీంతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.