మెదక్ : జిల్లాలోని మాసాయిపేట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం అదుపు తప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న చిన్నారి అద్విక (ఏడాదిన్నర వయసు) మృతి చెందింది. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న చేగుంట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.