నాగర్కర్నూల్ : జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహిపాల్ నాయక్ ఉపాధ్యాయుడి ఇంటికి శనివారం ఆయన బంధువు ఒకరు కారులో వచ్చారు. ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత కారును నిలుపగా.. అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలన్నీ కారంతా వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కారులో మంటలు చెలరేగిన సమయంలో చుట్టు పక్కల ఇండ్లు ఉండడంతో పలువురు భయాందోళనకు గురయ్యారు.