బొల్లారం, ఫిబ్రవరి 26: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు. ఈ సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటోన్మెంట్ తిరుమలగిరి కాంట బస్తీలో కలకలం రేపింది. బస్తీకి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీ రాజన్ పెద్ద కుమారుడు బండా రుత్విక్ రాజన్ (30) రెండేండ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడి టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఇటీవల ఎంఎస్ పూర్తి చేశారు.
కొన్ని రోజుల క్రితం స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా హఠాత్తుగా కిందపడిపోయాడు. దవాఖానకు తరలించగా, బ్రెయిన్ స్ట్రోక్తో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం రాత్రి మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుమలగిరిలోని వారి నివాసానికి తీసుకొచ్చారు. సోమవారం స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.