హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరిలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. అవిశ్వాస తీర్మానం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ జారీచేసిన నోటీసులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మేయర్, డిప్యూటీ మేయర్ వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లను బుధవారం కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.