సంగారెడ్డి : ఆయన ఒక పూజారి. నిత్యం భగవంతుడిని ఆరాధించే వ్యక్తి. మంచినే పాటిస్తూ చెడును త్యజించాల్సిన వ్యక్తి. మంచిచెడుల వ్యత్యాసాలను నలుగురికి వివరించి చెప్పాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి. కానీ ఆయనే తప్పుపని చేశాడు. ఏకంగా బంతిపూల వనంలో గంజాయి మొక్కులు పెంచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బంతిపూల వనంపై రైడ్ చేసి పట్టుకున్నారు.
బంతి మొక్కల నడుమ ఉన్న గంజాయి మొక్కలను చూసి ఖంగుతిన్నారు. ఆ గంజాయి మొక్కలు అన్నింటినీ పీకి విలువ కట్టారు. వాటి విలువ సుమారుగా రూ.70 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పంచగం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని దేవాలయం ప్రాంగణంలోగల బంతిపూల మొక్కల్లో పూజారి ఈ గంజాయి మొక్కలను పెంచారు.
బంతి పువ్వుల మొక్కల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న పూజారి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పంచగం గ్రామంలో దేవాలయ ప్రాంగణంలో బంతి పువ్వుల మొక్కల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న పూజారి
పూజారిని అరెస్ట్ చేసి రూ.70 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు pic.twitter.com/LdGj3DNtwz
— Telugu Scribe (@TeluguScribe) January 31, 2026