సత్తాచాటిన మహేశ్ భాగవత్ స్టూడెంట్స్
రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఏడీజీ మహేశ్ భాగవత్ దగ్గర సివిల్స్ ఇంటర్యూ కోసం శిక్షణ పొందిన అభ్యర్థులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు.
- కృతజ్ఞతలు తెలిపిన సివిల్స్ ర్యాంకర్లు
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఏడీజీ మహేశ్ భాగవత్ దగ్గర సివిల్స్ ఇంటర్యూ కోసం శిక్షణ పొందిన అభ్యర్థులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. టాప్-100లో సుమారు 15 మంది అభ్యర్థులు నిలిచారు. వరుసగా 3, 5, 9, 16, 39, 42, 50, 51, 61, 67, 74, 80, 81, 82, 100 ర్యాంకులు సాధించారు. మంగళవారం అభ్యర్థులు డీజీపీ కార్యాలయంలో ఏడీజీ మహేశ్ భాగవత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఇద్దరు..
సివిల్స్ ఫలితాల్లో రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్స్ శిక్షణ పొందినవారిలో కే ప్రణయ్‌కుమార్ 554వ ర్యాంకు, కే శశికాంత్ 891 వ ర్యాంకుతో అర్హత సాధించారు. దీంతో వారికి ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శ్రీధర్ అభినందనలు తెలిపారు. ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఐదుగురు ఇంటర్వ్యూ వరకు అర్హత సాధించినట్టు టీఎస్ఎస్సీఎస్సీ డైరెక్టర్ పేర్కొన్నారు. వీరిలో ప్రణయ్‌కుమార్, శశికాంత్ ర్యాంకులు కైవసం చేసుకున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

