త్వరలో క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్
అల్జీమర్స్, లంగ్స్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్‌లాంటి మహమ్మారుల నుంచి విముక్తి కల్పించేందుకు త్వరలో ప్రపంచానికి క్యూబా వ్యాక్సిన్ అందించబోతున్నదని, దీని తయారీ తుదిదశలో ఉన్నదని క్యూబా విప్లవవీరుడు చేగువేరా కుమార్తె, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ అలైదా గువేరా వెల్లడించారు.
- అన్ని క్యాన్సర్ల నుంచి విముక్తి
- విద్యాపరంగా క్యూబా పురోగతి
- చేగువేరా కుమార్తె అలైదా
- ప్రజల కోసమే సోషలిస్టు దేశాలు
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ప్రశంస
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): అల్జీమర్స్, లంగ్స్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్‌లాంటి మహమ్మారుల నుంచి విముక్తి కల్పించేందుకు త్వరలో ప్రపంచానికి క్యూబా వ్యాక్సిన్ అందించబోతున్నదని, దీని తయారీ తుదిదశలో ఉన్నదని క్యూబా విప్లవవీరుడు చేగువేరా కుమార్తె, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ అలైదా గువేరా వెల్లడించారు. క్యూబా దేశ కమ్యూనిస్టు పితామహుడు ఫిడెల్ కాస్ట్రో చొరవ వల్ల విద్యాపరంగా ఎంతో పురోగతి సాధించిందని, తమ దేశ డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా సుమారు 56 దేశాల్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆమెతో సోమవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పలు అంశాలపై చర్చించారు. అమెరికా ఆర్థికంగా ఎన్ని ఆంక్షలు విధించినా మొకవోని ధైర్యంతో క్యూబా ముందుకు సాగుతున్నదని.. విద్య, వైద్య రంగాల్లో గణనీయ ప్రగతి సాధించిందని అలైదా పేర్కొన్నారు. బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ సోషలిస్టు దేశాలు ప్రజల కోసం నిలబడుతాయని, క్యూబా ప్రపంచ మానవాళికి అండగా నిలిచేందుకు క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించబోతున్నదని కొనియాడారు. పెట్టుబడిదారి దేశాలు ప్రజల అవసరాలతో వ్యాపారం చేస్తాయని, కానీ సోషలిస్టు దేశం క్యూబా మాత్రం ప్రజల కోసం నిలబడుతున్నదని ప్రశంసించారు. కరోనా సమయంలో వైద్యపరంగా అనేక దేశాలను ఆదుకొన్నదని గుర్తుచేశారు. క్యాన్సర్‌తోపాటు ప్రమాదకర వ్యాధులను సమూలంగా తుడిచి పెట్టేందుకు క్యూబా కంకణం కట్టుకొన్నదని, అది గొప్ప విషయమని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

