రవీంద్రభారతి, మే 30: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డుల ఎంపిక ఆంధ్ర పెద్దల కనుసన్నల్లో జరిగిందని, 2014 నుంచి చేసిన అవార్డుల ఎంపిక సరైందికాదని తెలంగాణ సినిమా వేదిక(టీసీవీ) విమర్శించింది. గద్దర్ ఫిలిం అవార్డులను వెంటనే రద్దు చేసి, తెలంగాణ సినిమాలకే అవార్డులు ఇవ్వాలని వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీసీవీ కన్వీనర్ లారా, కోకన్వీనర్ మోహన్ బైరాగి, గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రామ్‌రెడ్డి, సినీదర్శకుడు ఎండీ రఫీ, సీనియర్ జర్నలిస్ట్ స్కైబాబా, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకుడు దిడ్డి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. అవార్డులలో జరిగిన అన్యాయంపై తెలంగాణ కళాకారులంతా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.