హైదరాబాద్, నవంబర్ 20:ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ 118వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పలు నూతన సేవలను ప్రారంభించింది. కార్పొరేట్ ఏఐ1, వాట్సప్ బ్యాంకింగ్ చానెల్, కెనరా యూపీఐ 123 పే సేవలను బ్యాంక్ ఎండీ, సీఈవో కే సత్యనారాయణరాజు ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. వీటి వివరాలు..
కార్పొరేట్ ఏఐ1: కార్పొరేట్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఈ నూతన సేవలు కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాం కింగ్, కెనరా ఏఐ1 కార్పొరేట్ యాప్ ద్వారా లావాదేవీలు జరుపు కోవచ్చును.
వాట్సప్ బ్యాంకింగ్ సేవలు: ఖాతాల్లో ఎంత డబ్బు ఉన్నది, మినీ స్టేట్మెంట్ను వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చును. ఇందుకోసం 907603001కి హాయ్/హాల్లో అని మెసేజ్ చేస్తే సరిపోతుంది.
కెనరా యూపీఐ 123 పే: ఫీచర్ ఫోన్ కస్టమర్ల కోసం ఐవీఆర్ ఆధార యూపీఐ సేవలు ప్రారంభించింది. ఖాతాదారుడికి సంబంధించిన ఏ బ్యాంక్ ఖాతా సమాచారం 10 దేశీయ భాషల్లో పొందవచ్చును.