అనుకూల తీర్పు ఇవ్వాలన్న లాయర్‌పై కలకత్తా హైకోర్టు ఫైర్
కోల్‌కతా, మార్చి 14: తమకు అనుకూలంగా తీర్పివ్వాలని ఏకంగా హైకోర్టు జడ్జితోనే బేరమాడాలని ప్రయత్నించాడో లాయర్. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ బీ సరఫ్ ముందుకు ఓ కేసు విచారణకు వచ్చింది. ఆ కేసులో తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని జడ్జిని ఓ లాయర్ సంప్రదించాడు. ఈ విషయాన్ని శుక్రవారం కోర్టు హాల్లో స్వయంగా జస్టిస్ సరఫ్ బట్టబయలు చేయటంతో ఒక్కసారిగా హాల్ ప్రాంగణంలో నిశ్శబ్దం అలుముకొన్నది. ‘మేము అమ్ముడుపోయే సరుకులం కాదు. లాయర్ వచ్చి అడగటం నన్ను షాక్‌కు గురిచేసింది. దురదృష్టకర ఘటన అది. ఓ లాయర్ వచ్చి మమ్మల్ని అవినీతిపరులుగా మార్చాలనుకోవటమా?’ అని వ్యాఖ్యానించారు. ఈ అం శం వ్యక్తిగతమైనందున సదరు లాయర్ పేరు ను బయటపెట్టదల్చుకోలేనని తెలిపారు.