CM Revant Reddy | గతంలో ఉద్యోగుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతోపాటు, కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులు పలు సూచనలు చేశారు. 2022 మార్చిలో పోలీసుల నియామకానికి గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
గతేడాది అక్టోబర్ నాలుగో తేదీ నాటికి 15,750 పోస్టుల భర్తీకి అభ్యర్థుల సెలక్షన్ ప్రక్రియ పూర్తయింది. అయితే హైకోర్టులో కేసుతో నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చించింది. కనుక సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోలీసు పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్, అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
కొత్త నోటిఫికేషన్లకు జీఓ46 రద్దు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు సూచించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా కొత్త నోటిఫికేషన్లు జారీ చేయడానికి 46 జీవో రద్దుపై నిర్ణయం తీసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.