హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 317, 46 జీవోలపై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సచివాలయంలో భేటీ కానున్నది. కమిటీలోని మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరుకానున్నారు. 317, 46 జీవోలకు సంబంధించి ఉద్యోగులు, అభ్యర్థుల నుంచి వినతులను స్వీకరించనున్నారు.